భాగ్యనగరంలో నేటి నుంచి డ్రోన్ల నిషేధం

HYD: నగరంలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు శనివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నగరంలో సుమారు 10 ప్రాంతాలలో డ్రోన్లు ఎగరవేయడాన్ని పోలీసు అధికారులు నిషేధం విధించారు. ఈ నిషేధం మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమం వేదికకు 3 కిలోమీటర్ల పరిధి వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.