‘కూటమి పాలనలో మౌలిక వసతులు కల్పన వేగవంతం’
కోనసీమ: కూటమి పాలనలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఇవాళ ఈతకోటలో రూ.1.62 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈతకోట పంచాయతీ ఏరియాలో NH-16 వరకూ రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.