కోహ్లీపై మెక్‌గ్రాత్ ప్రశంసలు
విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి అద్భుతమని కొనియాడాడు. వయసు పెరుగుతున్న కొద్దీ అతడి ఆటలో పదును తగ్గుతుందని కొందరు చేస్తున్న విమర్శలను కొట్టిపారేశాడు. వయసుతో పాటు కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారుతున్నాడని తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు 'మాస్టర్' అని వ్యాఖ్యానించాడు.