నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: వైరా మండలం విప్పలమడక గ్రామంలో ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం విప్పలమడక గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.