ITEP కోర్సుల ప్రవేశానికి అర్హుల లిస్ట్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ITEP నాలుగో సంవత్సరం కోర్సులకు సంబంధించి B.A, B.Sc, B.Ed అడ్మిషన్లకు అర్హత కలిగిన అభ్యర్థుల వివరాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 37 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ అధికారిక https://brau.edu.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.