అధిక వడ్డీ వసూలు.. అన్నదమ్ముల అరెస్ట్

ADB: అధిక వడ్డీ డబ్బుల వసూలు చేస్తున్న అన్నదమ్ములను మావల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మావలకు చెందిన దొగ్గలి ప్రవీణ్, దొగ్గలి ప్రశాంత్ డబ్బులను అధిక వడ్డీలకు ఇస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. అప్పులు ఇచ్చి రాయించుకున్న ధ్రువపత్రాలు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.