రేపు కంకిపాడుకు వాసంశెట్టి సుభాష్

కృష్ణా: కంకిపాడు యార్డులో శనివారం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ప్రారంభ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లాని పరిశీలిస్తున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 46.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా హాజరవుతారు.