48వ డివిజన్‌లో కమిషనర్ పర్యటన
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ దైనందిన పర్యటనలో భాగంగా స్థానిక 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో ఆదివారం పర్యటించారు. స్థానికంగా ఉన్న పార్కును సందర్శించి పార్కులో అవసరమైన మౌలిక వసతులను కమిషనర్ పరిశీలించి త్వరితగతిన వసతులను కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.