సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శనివారం వరహాపట్నంలో లబ్దిదారులకు అందజేశారు. హాస్పిటల్ బిల్లుల నిమిత్తం మంజూరైన ఈ చెక్కులను కైకలూరుకు చెందిన కంబాల శ్యామలకు రూ. 1,31,290, వెలగ రాజాజీకి రూ. 1,22,558, బంగారు అప్పన్నకు రూ. 67,038, అడపా భారతికి రూ. 1,17,086 చొప్పున పంపిణీ చేశారు.