'వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలి'

'వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయాలి'

SRPT: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, సోమవారం మోతే మండల ఎస్సై అజయ్ కుమార్‌‌ని కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికలాంగుల హక్కుల చట్టం 2016ను మండలంలో సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ​ఎస్సై అజయ్ కుమార్‌ను శాలువాతో సత్కరించిన అనంతరం, రాజేష్ వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.