మరమ్మతుల కోసం గుంత తవ్వారు.. పూడ్చడం మరిచారు
ASF: బెజ్జార్ మండలంలోని SC కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల కోసం గుంత తవ్వారు. అయితే దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేశారు. పక్కనే మురికి కాలువ నిండటంతో అందులోకి నీళ్లు వస్తున్నాయి. కాలువలు పూడిక తీయడంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ ప్రజలు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చివేసి కాలువలు శభ్రం చేయాలన్నారు.