చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దు: SI

చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దు: SI

MLG: తాడ్వాయి మండల కేంద్రంలో ఇవాళ SI జగదీష్ ఆధ్వర్యంలో యువతకు 'డ్రగ్స్ తరిమికొడదాం.. యువతను కాపాడుదాం' అనే అంశంలో భాగంగా గంజాయిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. గంజాయి, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు ఉన్నారు.