హనుమకొండలో ఉద్యమకారుల నిరసన

హనుమకొండలో ఉద్యమకారుల నిరసన

హనుమకొండ జిల్లాలో కాళోజీ సెంటర్‌లో తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇంటి స్థలం, పింఛన్ ఇస్తామని హామి ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై చాగంటి రమేష్ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.