'రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారు'
AP: రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నానంటూ 2014లో మొదలు పెట్టారని తెలిపారు. చంద్రబాబు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. 50 వేల ఎకరాల భూమి కావాలని పండించే భూములను రైతుల వద్దనుండి దుర్మార్గంగా లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.