వర్ధన్నపేట కోర్టు ఏర్పాటుకు ముందడుగు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో కోర్టు అందుబాటులోకి రానుంది. మున్సిఫ్ కోర్టు ఏర్పాటులో భాగంగా శనివారం వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబా పాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడానికి వనరులు ఉండడంతో కార్యాలయంలో పలుమార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు