సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

NLR: రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కోడూరుపాడులో ఆదివారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.