'అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి'
TPT: గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ కార్యకర్తలు, ఐదు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని గూడూరు CDPO మెహబూబీ కోరారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టు పరిధిలో శ్రీకృష్ణ మఠం పల్లమాల కేంద్రాలకు అలాగే సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.