రోడ్డు ప్రమాదం..ఇద్దరికీ తీవ్ర గాయాలు
SKLM: పొందూరు (M) కృష్ణాపురంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు నుంచి బైక్‌పై పొందూరు వస్తున్న కేశవదాసుపురానికి చెందిన రాజు, బుడుమూరుకు చెందిన దుర్గాప్రసాద్ కృష్ణాపురం వద్ద ఆగి ఉన్న బస్సును తప్పించబోయి, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.