ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పిట్ల రాజు (40) ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురయ్యాడు. ఈరోజు ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మనోహరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.