మొంథా తుఫాన్ భాదితులకు రేషన్ పంపిణీ
ASR: మొంథా తుఫాన్ భాదితులకు గురువారం ప్రభుత్వం పంపిణీ చేసిన 25 కేజీల రైస్ బ్యాగ్, ఇతర నిత్యవసర సరుకులు అందించడం జరిగిందని పెదబయలు మండలం కిముడుపల్లి సర్పంచ్ శోభారాణి తెలిపారు. రెండు రోజులుగా పడిన భారీ వర్షానికి కిముడుపల్లి కాలనీకి చెందిన అంగనైని అర్జున్ నాయుడు యొక్క ఇంటి గోడ కూలింది. దీంతో ఆ కుటుంబాన్ని తుఫాను భాదిత కుటుంబంగా పరిగణించి రేషన్ అందించారు.