'ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి'
KNR: వైద్య సిబ్బంది ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లో హుస్సేన్పురాలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (ముంతాజ్ ఖానా)ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ల సేవలను పరిశీలించారు.