బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లికి చెందిన బిల్లే గంగాధర్ అనే వ్యక్తి పశుగ్రాసం తీసుకుని బైకుపై ఇంటికి వస్తుండగా.. ధర్మవరం వైపు నుంచి అనంతపురం వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.