బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం నేతల ధర్నా
JN: జనగామ మండలం గానుగుపహాడ్ – చిటకోడూరు వాగుపై బ్రిడ్జ్ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఎం నేతలు గురువారం ధర్నా నిర్వహించారు. ఐదేళ్లుగా రాజకీయ నాయకులు కాలయాపన చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ ఇద్దరు రాజీనామా చేయాలన్నారు.