కాలువ కాదు.. ప్రధాన రహదారే

కాలువ కాదు.. ప్రధాన రహదారే

BDK: మండల పరిధిలోని ప్రధాన రహదారి నుంచి బీజీ కొత్తూరు వెళ్లే రోడ్డు ఓ కాలవను తలపించే విధంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టినా, కాంట్రాక్టర్ సరైన సమయానికి పనులు చేపట్టకపోవడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.