'నాటి పాలకులు మాట నిలుపుకోలేకపోయారు'
AP: గత ప్రభుత్వ(YCP) హయాంలో కొందరు నరకాసురుని శిష్యుల్లా వ్యవహరిస్తూ ఎన్నో తప్పులు చేశారని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. రామతీర్థం శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు. నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామన్న మాటను నిలబెట్టుకోలేకపోయారన్నారు. నాడు జరిగిన అపశృతులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.