VIDEO: 'సూర్యలంక బీచ్ పర్యటనకు అనుమతి'
BPT: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో బీచ్ సందర్శనలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి సూర్యలంక బీచ్ సందర్శనకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చినట్లు బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బీచ్‌లో స్నానాలు చేసేవారు మద్యం సేవించి లోపలికి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా లైఫ్ గాడ్స్ అందుబాటులో ఉంటారన్నారు.