'అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలి'

NDL: నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లే మండలానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. అనంతరం గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.