జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

NLG: విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూరు(మం) పామునుగుండ్ల వద్ద బైక్‌ను ఓ బొలెరో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న శివాజీ (బన్నీ) అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్ బాడీని నకిరేకల్ ప్రభుత్వ మార్చురీకి తరలించారు. బొలెరో ఓవర్ స్పీడ్‌తో రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.