యువతితో అసభ్య ప్రవర్తన.. చివరికి ఎమ్మైంది అంటే..!
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఓ యువతిని వేధించిన కేసులో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం బుధవారం జైలు శిక్ష విధించింది. ముద్దనూరు మండలం చెర్లోపల్లికి చెందిన గోపాల్, శ్రీధర్ 2023లో యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. వారిపై కడపలో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం కడప కోర్టు శ్రీధర్‌కు 21 రోజులు, గోపాల్‌కు 17 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.