పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
NDL: బనగానపల్లె పోలీస్ స్టేషన్‌ను ఇవాళ జిల్లా ఎస్పీ సునీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ సునీల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీసులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని పోలీసులకు ఎస్పీ సూచించారు.