ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్వో

ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్వో

KRNL: దేవనకొండ మండలంలో వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. చందూలి గ్రామానికి చెందిన ఓ సైనిక ఉద్యోగి, తన తల్లికి ఉన్న భూమిని తన పేరుకు మార్చుకోవడానికి దేవనకొండ మండల వీఆర్వో నర శ్యామల అశోక్‌ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సోమవారం పత్తికొండలోని ఓ కంప్యూటర్ నెట్‌ సెంటర్‌లో డబ్బు తీసుకుంటుడగా అరెస్ట్ చేశారు.