సర్వేపల్లికి రూ.13.78 కోట్లు.. మంత్రికి MLA ధన్యవాదాలు

సర్వేపల్లికి రూ.13.78 కోట్లు.. మంత్రికి MLA ధన్యవాదాలు

AP: సర్వేపల్లి నియోజకవర్గంలో 39 ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం రూ.13.78 కోట్లు మంజూరు చేసింది. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్‌కు సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో పేద ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.