కాణిపాకం వినాయక స్వామి దర్శించిన ఆర్‌జేసీ
CTR: కాణిపాకం ఆలయాన్ని తిరుపతి జోన్ దేవదాయ శాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ విభాగం, అన్నదానం, క్యూలైన్లు తదితర ప్రాంతాలను పరిశీలించి లడ్డూ తయారీ విధానాన్ని ఇంకా మెరుగుపరచాలని, భక్తులకు రుచికరమైన అన్నప్రసాదం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.