రామగుండం సర్వీస్ రోడ్డు పనులు ఆలస్యం

రామగుండం సర్వీస్ రోడ్డు పనులు ఆలస్యం

PDPL: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 48వ డివిజన్‌లో కవిత థియేటర్ నుంచి ఇల్లందు గెస్ట్ హౌస్ వరకు సర్వీస్ రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు ఆలస్యమవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.