5 నెలలుగా జీతాలు లేక.. మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

5 నెలలుగా జీతాలు లేక.. మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కష్టపడి పనిచేస్తున్నా తమకు రావాల్సిన వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని వారు ఆరోపించారు. జీతాల విషయమై ప్రశ్నిస్తే అధికారులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కార్మికులు వాపోయారు.