VIDEO: 'సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ పండుగలు'

ADB: సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ పండుగలను నిర్వహించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తెగకు ఓ పండుగ ఉంటుందని తెలిపారు. పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు.