రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కర్నూలులోని మహావీర్ నగర్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతానికి చెందిన రాజేష్ (17) అనే యువకుడు మృతి చెందగా, తన తండ్రి గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. కల్లూరులో ఎల్లమ్మ దేవత పూజకు వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.