నిద్ర మాత్రలు మింగిన 8వ తరగతి విద్యార్థిని
MHBD: గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వసంత మరో విద్యార్థినితో జరిగిన గొడవ కారణంగా ఆదివారం మనస్థాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినికి చికిత్స కొనసాగుతోంది.