రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BHNG: తుర్కపల్లి పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సౌభ్రాతృత్వం, సేవా భావానికి ప్రతీక అని తెలిపారు. పేద కుటుంబాలకు ఉపవాస దినాల్లో ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మరియు నాయకులు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.