డిసెంబర్ 21న లోక్ అదాలత్..!
GDWL: డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ కాదగిన వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత పేర్కొన్నారు. సోమవారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ అదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె హాజరయ్యారు. ఠాణాలు, కోర్టుల చుట్టూ కక్షిదారులు తిరగకుండా ఇరు వర్గాలను సమన్వయపరచి పరిష్కరించుకోవచ్చు అన్నారు.