దిండ్లు.. దుప్పట్లు.. అలాగే వాడుతున్నారా..?
దీర్ఘకాలంలో దిండుపై దుమ్ము, ఇతర అలర్జీ కారకాలు పేరుకుని బ్యాక్టీరియా వృద్ధికి దారి తీస్తాయి. అయితే వారానికి ఒకసారైనా ఉతకాలి. వాటిని తరచూ ఎండలో ఉంచాలి. కొన్ని రకాల చర్మ వ్యాధులు, అనారోగ్యాలతో బాధపడే వారు క్రమం తప్పకుండా బెడ్ షీట్లు, పిల్లో కవర్‌లను మారుస్తూ ఉండాలి. అందరూ వాడుకునేవి కాకుండా వారి కోసం ప్రత్యేకంగా కేటాయించడం మంచిది.