పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీఐ, ఎస్సై
SRPT: తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతికుమార్ కలిసి మంగళవారం సందర్శించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. పోలింగ్ జరిగే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.