కవిత సమక్షంలో జాగృతిలో చేరికలు
కరీంనగర్‌లో జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు నాయకులు ఆమె పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కవిత నాయకత్వంపై విశ్వాసంతో కండువాలు కప్పుకున్నారు. తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యమని, కొత్త తరానికి కొత్త రాజకీయాలు అందిస్తామని కవిత వెల్లడించారు.