15 క్వింటాల మిర్చి చోరీకి యత్నం

15 క్వింటాల మిర్చి చోరీకి యత్నం

KMM: తిరుమలాయపాలెం మండలం ఏనేకుంట తండాలో దొంగలు 15 క్వింటాళ్ల మిర్చి చోరీకి యత్నించారు. తోటలోకి ప్రవేశించి సుమారు ఒక కిలోమీటరు దూరం వరకు మిర్చిని మోసుకెళ్లిన దుండగులు కాకరవాయి పొలిమేరలో రాశులుగా పోసి పరారయ్యారు. బాధిత రైతు రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి సోమవారం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.