VIDEO: లేబర్ కార్యాలయం వద్ద ధర్నా

HYD: జీహెచ్ఎంసీ పరిధిలో రాంకీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు, హెల్పర్లు వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆధ్వర్యంలో కార్మికులు లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తక్కువ వేతనాలు ఇస్తూ యాజమాన్యం తమ శ్రమను దోచుకుంటుందని కార్మికులు ఆరోపించారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.