హత్య రాజకీయాలంటూ కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు

హత్య రాజకీయాలంటూ కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు

WGL: వరంగల్ నగరంలోని శంభునిపేట జంక్షన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ మంత్రి వాకాటి శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవ్ మృతికి కాంగ్రెస్ వేధింపులే కారణమని ఆరోపించారు. హత్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.