జూబ్లీహిల్స్ పోటీలో నలుగురు మహిళ అభ్యర్థులు

జూబ్లీహిల్స్ పోటీలో నలుగురు మహిళ అభ్యర్థులు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు సోషలిస్ట్ పార్టీ నుంచి సుభద్రారెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇంక్విలాబ్-ఏ-మిల్లత్ నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. నలుగురు అభ్యర్థుల్లో అస్మాబేగం పిన్న వయస్కురాలు.