తూటంగి వద్ద ప్రమాదకరంగా ఉన్న గోతులు

ASR: డుంబ్రిగుడ మండలంలోని తూటంగి పంచాయితీ రోడ్డులో సెల్ టవర్ కేబుల్ వైర్ ఏర్పాటు కోసం తవ్విన గోతులను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ఈ రహదారి మీదగా పెదబయలు, ఒడిశా వెళ్లే వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాలలో కనీసం రోడ్డు కనిపించని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు..