ప్రైవేటీకరణను అడ్డుకుందాం: రంగయ్య
ATP: కుందుర్పి మండలం అపిలేపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.