హర్మూజ్ సంక్షోభం.. చమురు ధరలు భారీగా పెంపు
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ ఆరామ్‌కో ఆసియా దేశాలకు షాకిచ్చింది. మే నెలకు సంబంధించి 'అరబ్ లైట్ క్రూడ్' ధరను రికార్డు స్థాయిలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బెంచ్‌మార్క్ ధర కంటే అదనంగా 19.50 డాలర్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్కెట్ నిపుణులు 40 డాలర్ల వరకు పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.